ఇంగ్లండ్ తో సెమీస్.. సగం ఓవర్లలోపే ఓపెనర్లను కోల్పోయిన భారత్

  • టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా
  • రెండో ఓవర్లోనే కేఎల్ రాహుల్ ఔట్
  • ఇన్నింగ్స్ ను చక్కదిద్దిన రోహిత్, విరాట్
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లండ్ తో అడిలైడ్ లో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ లో కాస్త తడబడుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా రెండో ఓవర్లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (5) వికెట్ కోల్పోయింది. వచ్చీరాగానే ఓ ఫోర్ కొట్టిన అతడిని రెండో ఓవర్లో వికెట్ కీపర్ క్యాచ్ ద్వారా క్రిస్ వోక్స్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ మంచి షాట్లతో ఫోర్లు, సిక్సర్లు కొడుతూ పరుగులు రాబట్టారు.

 గత మ్యాచ్ ల్లో విఫలమైన కెప్టెన్ రోహిత్.. ఉన్నంతసేపు బ్యాట్ ఝుళిపించాడు. నాలుగు ఫోర్లతో అలరించాడు. 28 బంతుల్లో 27 పరుగులు చేసిన అతను క్రిస్ జోర్డాన్ వేసిన 9వ ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించి సామ్ కరన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దాంతో, రెండో వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ తోడవగా.. సగం ఓవర్లకు భారత్  62/2 స్కోరు తో నిలిచింది.


More Telugu News