జైలు నుంచి విడుదలయ్యాక రాజాసింగ్ తొలి ట్వీట్

  • దాదాపు 40 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన రాజాసింగ్
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • ధర్మం విజయం సాధించిందంటూ రాజాసింగ్ ట్వీట్
మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే కేసులో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దాదాపు 40 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. తెలంగాణ హైకోర్టు నిన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో, ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. 

మతాలను కించ పరిచే వ్యాఖ్యలు చేయరాదని, మీడియా ముందుకు రాకూడదని, 3 నెలల వరకు సోషల్ మీడియలో వీడియోలు పోస్ట్ చేయకూడదని, జైలు నుంచి విడులయ్యే సమయంలో ర్యాలీలు నిర్వహించకూడదని హైకోర్టు ఆయనకు షరతులు విధించింది. ఇంకోవైపు జైలు నుంచి ఇంటికి చేరకున్న తర్వాత రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తొలి ట్వీట్ చేశారు.

'ధర్మం విజయం సాధించింది. మరోసారి మీకు సేవ చేయడానికి వచ్చాను. జై శ్రీరామ్' అని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


More Telugu News