పాకిస్థాన్‌తో సెమీఫైనల్.. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- తుది జట్లలో మార్పులు లేకుండా బరిలోకి ఇరు జట్లు
- సూపర్ 12 లో గ్రూప్1లో న్యూజిలాండ్ కు అగ్రస్థానం
- గ్రూప్2లో రెండో స్థానంతో సెమీస్ చేరిన పాక్
పాకిస్థాన్ తో టీ20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కివీస్ తన తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. ఇంకోవైపు పాక్ కూడా సూపర్ 12 రౌండ్ చివరి మ్యాచ్ లో ఆడిన తుది జట్టునే కొనసాగించింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం మెల్ బోర్న్ లో జరిగే పైనల్ చేరుతుంది. సూపర్ 12 దశలో నిలకడగా ఆడిన న్యూజిలాండ్ గ్రూప్1లో అగ్రస్థానం సాధించింది. మరోవైపు పాకిస్థాన్ గ్రూప్2లో రెండో స్థానంతో సెమీస్ చేరుకుంది.
పాకిస్థాన్ తుది జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కీపర్), బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.
న్యూజిలాండ్ తుది జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.