భారీగా తగ్గిన ఎలాన్ మస్క్ సంపద.. టెస్లా షేర్లకు అమ్మకాల సెగ

  • 195 బిలియన్ డాలర్లకు పడిపోయిన నికర సంపద
  • మంగళవారం 3 శాతం నష్టపోయిన టెస్లా షేరు
  • 19 మిలియన్ షేర్లను విక్రయించిన మస్క్
ట్విట్టర్ ను కొనుగోలు చేయనున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించిన దగ్గర్నుంచి, ఆయన సంపద ఐస్ క్రీమ్ లా కరిగిపోతోంది. తాజాగా నికర సంపద (నెట్ వర్త్) 200 బిలియన్ డాలర్లలోపు తగ్గిపోయి రూ. 194.8 బిలియన్ డాలర్లకు చేరింది. ట్విట్టర్ కోసం మస్క్ తన వాటాలను అమ్ముతుండడం వాటాదారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో వారు కూడా అమ్మకాలకే మొగ్గు చూపిస్తున్నారు. మంగళవారం కూడా టెస్లా షేరు 3 శాతం నష్టాలను చూసింది.

ఈ ఏడాది ఏప్రిల్ లో ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ బిడ్ వేసిన దగ్గర్నుంచి టెస్లా మార్కెట్ విలువ సగం మేర తరిగిపోయింది. దీంతో ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద 70 బిలియన్ డాలర్ల వరకు క్షీణించింది. తాజాగా యూఎస్ సెక్యూరిటీస్ కమిషన్ కు టెస్లా ఇచ్చిన సమాచారం మేరకు కంపెనీలో మస్క్ 19.5 మిలియన్ షేర్లను విక్రయించారు. వీటి విలువ రూ. 3.95 బిలియన్ డాలర్లు. అంతేకాదు ట్విట్టర్ డీల్ తర్వాత నుంచి ఇప్పటి వరకు 20 బిలియన్ డాలర్ల విలువ షేర్లను ఆయన విక్రయించారు.


More Telugu News