సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ చేత ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము
- 50వ సీజేఐగా బాధ్యతలను చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్
- 2024 నవంబర్ 10 వరకు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ చంద్రచూడ్
- గతంలో సీజేఐగా పని చేసిన జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. 50వ సీజేఐగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రెండేళ్ల పాటు (2024 నవంబర్ 10 వరకు) సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలను నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13న బాధ్యతలను స్వీకరించారు. పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో ఆయన భాగస్వామిగా ఉంటూ కీలక తీర్పులను వెలువరించారు. అయోధ్య భూ వివాదం కేసు, గోప్యత హక్కు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, ఆధార్ చెల్లుబాటు వంటి కేసులకు సంబంధించిన ధర్మాసనాల్లో ఉన్నారు. అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా కూడా పని చేశారు.
మరోవైపు జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా బాధ్యతలను నిర్వర్తించారు. దాదాపు ఏడేళ్ల పాటు ఆయన సీజేఐగా ఉన్నారు. మన దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పని చేసిన ఘనత ఆయనది.