రాజమండ్రి స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 9 రైళ్ల రద్దు
- ప్రస్తుతం ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు
- రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన అధికారులు
- రెండు గంటలు ఆలస్యంగా నడవనున్న విజయవాడ-లింగంపల్లి రైలు
రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో రైల్వే అధికారులు 9 రైళ్లను పూర్తిగా, రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు ఒకే ట్రాక్‌పై కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ-లింగంపల్లి రైలు 2 గంటలు ఆలస్యంగా నడవనుంది. విజయవాడ-రాజమండ్రి, కాకినాడ పోర్టు- విజయవాడ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.
పూర్తిగా రద్దయిన రైళ్లలో విజయవాడ-విశాఖపట్టణం (12718), విశాఖ-విజయవాడ (12717), గుంటూరు-విశాఖ (17239), విశాఖ-గుంటూరు (17240), విశాఖ-విజయవాడ (22701), విజయవాడ-విజయవాడ (22702), విజయవాడ-గుంటూరు (07628), గుంటూరు-విజయవాడ (07864), కాకినాడ పోర్ట్-విజయవాడ (17257) రైళ్లు ఉన్నాయి.