దేశంలో ముగిసిన చంద్ర గ్రహణం
- భారత్ లో కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం
- కొన్ని చోట్ల పాక్షికంగానే దర్శనం
- గువాహటిలో అత్యధిక సమయం కనిపించిన గ్రహణం
- తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాల పాటు చంద్ర గ్రహణం
భారత్ లో చంద్ర గ్రహణం ముగిసింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం కనువిందు చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపించింది. అసోంలోని గువాహటిలో అత్యధికంగా 1 గంట 43 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5.40 గంటల నుంచి చంద్ర గ్రహణం కనిపించింది. అయితే ఏపీ, తెలంగాణ ప్రజలు చంద్ర గ్రహణాన్ని కేవలం 39 నిమిషాల పాటు మాత్రమే చూడగలిగారు.
మళ్లీ మూడేళ్లకు భారత్ లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. 2025 మార్చి 14న ఈ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. కాగా, నేటి గ్రహణం కారణంగా మూతపడిన ఆలయాలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆలయ శుద్ధి పనులు చేపట్టారు.