'ఆదిపురుష్' పై అసంతృప్తి ఆరు నెలల్లో పోయేనా?
- 'ఆదిపురుష్' విడుదల వాయిదా
- ఆరు నెలల వెనక్కి వెళ్లిన విడుదల
- ఫస్టు టీజర్ తోనే ఆకట్టుకోలేకపోయిన టీమ్
- ప్రభాస్ అభిమానుల నుంచి అసంతృప్తి జ్వాలలు
- అవుట్ పుట్ ను సెట్ చేసే పనికోసమే వాయిదా అనే టాక్
ఒక సినిమా నుంచి ఫస్టు అవుట్ పుట్ వదలడానికి ముందు దానిపై ఎంతో కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే ఆ సినిమాపై ఆసక్తి పెంచడంలోను .. అంచనాలు పెంచడంలోను ఫస్టు అవుట్ పుట్ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఇక అదే పాన్ ఇండియా సినిమా అయితే ఆ ప్రాజెక్టు నుంచి వచ్చే ఫస్టు అవుట్ పుట్ పట్ల మరింత దృష్టి ఉంటుంది. అలాంటి ఫస్టు అవుట్ పుట్ విషయంలో 'ఆదిపురుష్' టీమ్ ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదనే విమర్శలు ఫస్టు టీజర్ తోనే వచ్చాయి.
ఇంతవరకూ పౌరాణిక చిత్రాలలో సీతారాములను చూపించిన తీరు వేరు. రావణుడి పాత్రను .. హనుమంతుడి పాత్రను ఆవిష్కరించిన విధానం వేరు. అందుకు భిన్నంగా ఈ సినిమాలోని వేషధారణ ఉండటం అభిమానులను నిరాశ పరిచింది. ఇక గతంలో రామాయణ ఇతివృత్తం ఆధారంగా చాలానే సినిమాలు వచ్చాయి. మరి వాటికీ .. ఈ సినిమాకి మధ్య తేడా ఏంటి? అంటే, గ్రాఫిక్స్ అనే చెప్పుకోవాలి. అలాంటి గ్రాఫిక్స్ కోసం కోట్ల రూపాయలను గుమ్మరించినట్టు ఈ సినిమా టీమ్ చెప్పింది. తీరా టీజర్ చూస్తే ఆ స్థాయిలో గ్రాఫిక్స్ లేవనే టాక్ వచ్చింది.
ప్రభాస్ ఉదాసీన వైఖరిని ఆసరాగా తీసుకుని మేకర్స్ ఇలా వ్యవహరించారంటూ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అందువల్లనే సంక్రాంతికి రావలసిన ఈ సినిమాను 6 నెలల పాటు వాయిదా వేశారు. ఈ ఆరునెలల్లో గ్రాఫిక్స్ వర్క్ లో నాణ్యత తీసుకురావడం .. కొన్ని సీన్స్ ను రీషూట్ చేయడం జరుగుతుందని అంటున్నారు. ఈ కారణంగా బడ్జెట్ మరో 100 కోట్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ అభిమానుల్లోని అసంతృప్తిని పోగొట్టడానికి దర్శకుడు ఓం రౌత్ ఈ ఆరునెలల సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడేమో చూడాలి మరి.