విభజన సమస్యలపై ఈ నెల 23న కీలక భేటీ.... తప్పనిసరిగా రావాలంటూ ఏపీ, తెలంగాణలకు సమాచారం పంపిన కేంద్రం
- 2014లో విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
- ఇప్పటికీ పరిష్కారం కాని పలు సమస్యలు
- మరోసారి చర్చలకు ముహూర్తం నిర్ణయించిన కేంద్రం
- కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎనిమిదేళ్ల కిందట ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలోని హామీలు, ఇతర అంశాలు పూర్తిచేసేందుకు పదేళ్లు గడువుగా పేర్కొన్నారు. అయితే, విభజన సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, ఇరు రాష్ట్రాలతో చర్చలకు కేంద్రం ముహూర్తం నిర్ణయించింది. ఈ నెల 23న దేశ రాజధాని ఢిల్లీలో విభజన సమస్యలపై సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కీలక భేటీకి తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సమాచారం పంపింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు.