గౌతమ్ రెడ్డి జీవితంపై 'చిరస్మరణీయుడు' పుస్తకం... ఆవిష్కరించిన సీఎం జగన్
- ఆకస్మికంగా మృతి చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి
- పుస్తకం రాసిన డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి
- సీఎం కార్యాలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం
- గౌతమ్ రెడ్డితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం జగన్
ఏపీ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆమధ్య గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన జీవితంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, పాత్రికేయుడు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి 'చిరస్మరణీయుడు' పేరిట పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
పుస్తకావిష్కరణ సందర్భంగా, గౌతమ్ రెడ్డితో తన స్నేహానుబంధాన్ని సీఎం జగన్ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి, సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.