ఎంపీ సీఎం రమేశ్ కు అరుదైన అవకాశం... రాజ్యసభ హౌజ్ కమిటీ చైర్మన్ గా నియమకం
- ఈ నెల 2ననే రాజ్యసభ ప్రకటన విడుదల
- తాజాగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన వైనం
- ఈ హోదాలో రాజ్యసభ సభ్యుల వసతి సౌకర్యాలను పర్యవేక్షించనున్న సీఎం రమేశ్
ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సీఎం రమేశ్ కు అరుదైన అవకాశం దక్కింది. రాజ్యసభ హౌజ్ కమిటీకి ఆయన చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాజ్యసభ సెక్రటేరియట్ సీఎం రమేశ్ నియామకానికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకానికి సంబంధించి రాజ్యసభ నుంచి ఈ నెల 2ననే ఓ ప్రకటన విడుదల కాగా... తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాజ్యసభ హౌజ్ కమిటీ చైర్మన్ హోదాలో సభ్యులకు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పించే కీలక బాధ్యతలను సీఎం రమేశ్ పర్యవేక్షించనున్నారు. కొత్తగా సభకు ఎన్నికైన వారికి రాజధానిలో సర్కారీ బంగ్లాలను కేటాయించడం, పదవీ కాలం పూర్తయిన సభ్యులను ఆయా బంగ్లాల నుంచి ఖాళీ చేయించడం కూడా ఈ కమిటీ బాధ్యతే. ఇక సభ్యులకు కేటాయించిన బంగ్లాల్లో ఆయా సౌకర్యాల ఏర్పాటును కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుంది.