ఇండియాతో మళ్లీ పాక్ తలపడేలా చేసినందుకు దక్షిణాఫ్రికాకు ధన్యవాదాలు: షోయబ్ అఖ్తర్
- నెదర్లాండ్స్ తో దక్షిణాఫ్రికా ఓడటంతో సెమీస్ కు చేరిన పాకిస్థాన్
- మీరు ఓడి మాకు సెమీస్ అవకాశాలు కల్పించారన్న అఖ్తర్
- ఇక చేయాల్సింది భారత్ తో మ్యాచ్ ను గెలవడమే అని వ్యాఖ్య
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో మన దాయాది దేశం పాకిస్థాన్ సెమీ పైనల్స్ కు చేరిన సంగతి తెలిసిందే. నిన్న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 16 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓడిపోయింది. దీంతో, వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుందనుకున్న పాకిస్థాన్ అనూహ్యంగా సెమీస్ లో బెర్త్ దక్కించుకుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిచి ఉంటే పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించేది.
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ధన్యవాదాలు తెలిపాడు. మ్యాచ్ లో ఓడిపోయి తమకు సెమీస్ చేరే అవకాశాలను కల్పించారని అన్నారు. తమ చిరకాల ప్రత్యర్థి భారత్ తో మరోసారి తలపడే అవకాశాన్ని కల్పించారని కృతజ్ఞతలు తెలిపాడు. ఇక పాకిస్థాన్ చేయాల్సింది భారత్ తో మ్యాచ్ ను గెలవడమేనని అన్నారు.