ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా విరాట్ కోహ్లీ
- వరల్డ్ కప్ లో అద్భుత ఫామ్ ను కొనసాగిస్తున్న కోహ్లీ
- అక్టోబర్ లో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్న కోహ్లీ
- పాక్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడన్న ఐసీసీ
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అదిరిపోయే ఇన్నింగ్స్ తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. తాజాగా అక్టోబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం జింబాబ్వే క్రికెటర్ సికందర్ రాజా, దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కూడా పోటీపడ్డారు. చివరకు కోహ్లీ ఎంపికయ్యాడు.
అక్టోబర్ లో కోహ్లీ కేవలం నాలుగు ఇన్నింగ్స్ లలో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో నాటౌట్ గా 82 పరుగులు చేయడం అత్యద్భుతమని ఈ సందర్భంగా ఐసీసీ వ్యాఖ్యానించింది. ఆ మ్యాచ్ లో ఓటమి అంచుల్లో ఉన్న ఇండియాకు కోహ్లీ అద్భుత విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో ఇండియాను సెమీస్ కు చేర్చడంలో కోహ్లీ కీలక పాత్రను పోషించాడు. అడిలైడ్ లో గురువారం జరిగే సెమీస్ లో ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడబోతోంది.