సినిమా ఎలా ఉందో చెప్పండి .. ఆర్టిస్టుల పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడొద్దు: వరలక్ష్మి శరత్ కుమార్

  • 'యశోద' ప్రమోషన్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ 
  • సరోగసీ కథా నేపథ్యంలో వచ్చిన ప్రస్తావన
  • ఒకరి నిర్ణయాల పట్ల మరొకరి అభిప్రాయాలు అనవసరమన్న వరలక్షి 
  • ఆర్టిస్టుల పర్సనల్ విషయాలపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదంటూ అసహనం
సమంత ప్రధానమైన పాత్రగా 'యశోద' సినిమా రూపొందింది. హరి శంకర్ - హరీశ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన 5 భాషల్లో విడుదల కానుంది. సరోగసి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఇంటర్నేషనల్ న్యూస్ ఐటమ్స్ ను సేకరించి, ఆ కథనాల ఆధారంగా ఈ కథను అల్లుకున్నట్టుగా దర్శకులు చెప్పారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. 

తాజా ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ .. "ఇప్పుడంతా సెలబ్రిటీల లైఫ్ లో సరోగసి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వారు తమ లైఫ్ కి సంబంధించిన విషయాలను పక్కన పెట్టేసి, వేరే వారి లైఫ్ లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా గమనిస్తూ ఉంటున్నారు. దీనికి కారణం వాళ్లకి పని లేకపోవడమే" అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. 

"వేరే ఎవరైనా కావొచ్చు .. వాళ్లు తమ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. దానిపై ఇతరుల అభిప్రాయాలు .. చర్చలు అవసరమా? సినిమా ఆర్టిస్టుల పట్ల మీకు అభిమానం ఉంటే వారి సినిమా చూడండి .. ఎలా ఉందో చెప్పండి. అంతేగానీ వాళ్ల పర్సనల్ విషయాలను గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు" అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది.


More Telugu News