ఎన్టీఆర్ గారు నన్ను 'కోడలా' అని పిలవడానికి ఒక కారణం ఉంది: ఎల్. విజయలక్ష్మి
- ఎన్టీఆర్ ను ఫస్టు టైమ్ చూసింది 'జగదేకవీరుని కథ' షూటింగులోనని వెల్లడి
- ఆయన చాలా సింపుల్ గా ఉండేవారని వ్యాఖ్య
- పదేళ్ల కాలం ఫాస్టుగా గడిచిపోయిందంటూ వివరణ
నటిగా .. నర్తకిగా ఎల్. విజయలక్ష్మి 60వ దశకంలో ఒక వెలుగు వెలిగారు. అప్పటి సినిమాలను చూసేవారికి ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి చెప్పుకొచ్చారు. "సావిత్రిగారు .. జమునగారు .. బి.సరోజాదేవిగారు నాకంటే సీనియర్స్. నా డాన్స్ అంటే వాళ్లకి ఇష్టం .. వాళ్ల నటన అంటే నాకు ఇష్టం" అని అన్నారు.
"అందరు హీరోయిన్స్ తో నేను చాలా ఫ్రెండ్లీగా ఉండేదానిని. మా మధ్య ఎలాంటి అసూయ ద్వేషాలు ఉండేవి కాదు. అప్పటి షూటింగులు ఒక పిక్ నిక్ లా జరిగిపోతుండేవి. 'జగదేకవీరుని కథ' సినిమాలో 'వరించి వచ్చిన మానవ వీరుడు' పాటను చిత్రీకరించే సమయంలోనే నేను ఫస్టు టైమ్ ఎన్టీఆర్ గారిని చూశాను. ఆ తరువాత ఆయనతో చాలా సినిమాలు చేసే అవకాశం లభించింది. ఆయన నన్ను 'కోడలా' అనే పిలిచేవారు. 'నర్తనశాల' సినిమాలో నేను ఆయనకి కోడలుగా నటించాను. అప్పటి నుంచి నన్ను ఆయన అలాగే పిలిచేవారు.
నేను పెద్ద హీరోను అన్నట్టుగా సెట్లో ఎన్టీఆర్ ఉండేవారు కాదు. చాలా సింపుల్ గా ఉండేవారు. షూటింగు సమయానికి ముందే మేకప్ వేసుకుని ఆయన రెడీగా ఉండేవారు. అలాగే తన పాత్ర విషయంలో కూడా ఆయన ఎంతో క్రమశిక్షణతో .. అంకితభావంతో ఉండేవారు. ఆయన నుంచి ఆ సమయపాలన .. క్రమశిక్షణను నేను నేర్చుకున్నాను. నటిగా పదేళ్ల కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియనంత బిజీగా ఉండేదానిని. అప్పుడప్పుడు ఆ రోజులు గుర్తొస్తుంటాయి" అని చెప్పుకొచ్చారు.