కెప్టెన్ అవుదామని అనుకుంటే .. బయటికి పంపిస్తారా బిగ్ బాస్?: ఏడుస్తూ కుప్పకూలిన గీతూ
- బిగ్ బాస్ హౌస్ నుంచి గీతూ ఎలిమినేషన్
- ఎవరూ ఊహించని సంఘటన ఇది
- తాను బయటికి వెళ్లనంటూ మొరాయించిన గీతూ
- నివ్వెరపోయిన హౌస్ మేట్స్
- తాను ఊహించలేదంటూ గీతూ కన్నీళ్లు
'బిగ్ బాస్ సీజన్ 6'లో నిన్న (ఆదివారం) చోటు చేసుకున్న సంఘటన అందరూ ఒక్కసారిగా బిత్తరపోయేలా చేసింది. అదే 'గీతూ ఎలిమినేషన్. గీతూ అలా బయటికి వెళ్లిపోవలసి వస్తుందని ఆమెతో పాటు అటు హౌస్ లోని వాళ్లు కానీ .. టీవీల ముందు కూర్చున్న వాళ్లుగానీ అనుకోలేదు. ఎందుకంటే హౌస్ లో ఆమె బలమైన పోటీదారు. తన ఎలిమినేషన్ గురించి వినగానే గీతూ ఒక్కసారిగా షాక్ అయింది.
"కెప్టెన్ అవుదామని అనుకుంటే నన్ను బయటికి పంపిస్తారా బిగ్ బాస్? నాకు వెళ్లాలని లేదు బిగ్ బాస్ .. ఇక్కడే ఉండిపోవాలని ఉంది. నువ్వు కూడా మా అమ్మా నాయన మాదిరే బిగ్ బాస్ .. నన్ను బయటికి పంపించొద్దు" అని ఏడుస్తూ లాన్ లో కుప్పకూలిపోయింది.
గీతూ బిగ్ బాస్ హౌస్ లో తనకి ఇష్టమైన ప్రదేశాలలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత హౌస్ మేట్స్ ను హగ్ చేసుకుని ఎమోషనల్ అయింది. అక్కడి నుంచి బిగ్ బాస్ హౌస్ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చిన తరువాత కూడా, తనకి బయటికి వెళ్లాలని లేదనీ, డోర్స్ క్లోజ్ చేయమని కోరింది. చివరికి ఆమె హౌస్ లో నుంచి బయటికి వచ్చేసి .. స్టేజ్ పై ఉన్న నాగార్జున దగ్గరికి చేరుకుంది. బిగ్ బాస్ లో తాను ప్రతి గేమ్ ను చాలా బాగా ఆడాననీ, టాప్ 5లో ఉండాలనేది తన డ్రీమ్ కాదనీ, టాప్ 1లో నిలబడాలనే తాను అనుకున్నానని చెప్పింది. కెప్టెన్ కాకుండా ... హౌస్ ను రూల్ చేయకుండా బయటికి వెళ్లిపోవలసి వస్తుందని తాను ఎంతమాత్రం ఊహించలేదని అంది.
గీతూ ఎలిమినేషన్ పట్ల రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గీతూ ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుందనీ, గేమ్ ఎలా ఆడాలో తమకి చెబుతూ ముందుకు తీసుకుని వెళుతూ వచ్చిందని నాగార్జునతో చెప్పాడు. గీతూ గేమ్ ఆడే తీరు చాలా బాగుంటుందనీ, ఎదుటివారు చేసే తప్పులను చెప్పే ధైర్యం ఆమెకి ఉందని బాలాదిత్య బాధపడ్డాను. ఇక ఫైమా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. అలాగే శ్రీ సత్య .. శ్రీహాన్ కూడా కన్నీళ్లు పెట్టారు. ఇక తనకి బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది ఆదిరెడ్డితో స్నేహమేనని గీతూ అంది. ఆ సమయంలో ఆదిరెడ్డి కూడా ఎమోషనల్ అయ్యాడు. గీతూ ఎలిమినేషన్ ఎంతవరకూ కరెక్ట్ అనే విషయం అలా ఉంచితే, ఇక ఆ స్థాయి సందడి హౌస్ లో కనిపించడం కష్టమేనని అనిపించకమానదు.