గద్వాల నగ్నచిత్రాల కేసు.. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న పోలీసులు!
- ప్రధాన సూత్రధారి మహేశ్వర్‌రెడ్డి ఇప్పటికే అరెస్ట్
- హైదరాబాద్‌లో నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఈ కేసులో పోలీసులు, ఉద్యోగులు ఉన్నారన్న వార్తను ఖండించిన సీఐ
గద్వాల నగ్న చిత్రాల కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి మహేశ్వర్ రెడ్డి (తిరుమలేశ్) స్నేహితుడు నిఖిల్‌ను నిన్న జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అంతుకుముందే అదుపులోకి తీసుకున్న మరో ఇద్దరు యువ నాయకులపై విచారణ కొనసాగుతోంది. నగ్న చిత్రాలు బయటకు వెళ్లడంలో వీరిద్దరిలో ఒకరి పాత్ర ఉందని తెలుస్తోంది.
ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. నగ్న చిత్రాల రికార్డు వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఈ వ్యవహారంలో పోలీసులు, ఉద్యోగులు ఉన్నారంటూ వస్తున్న వార్తలను సీఐ చంద్రశేఖర్ ఖండించారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టబోమని, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ నగ్న చిత్రాలను తొలుత ఎవరు? ఎవరికి పంపారు? వాటిని ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చిత్రాలను ఎవరూ షేర్ చేయవద్దని, మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని ఎస్పీ రతన్ కుమార్ హెచ్చరించారు.