బన్నీ వాసు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్!
- 'గీతా ఆర్ట్స్ 2'కి నిర్మాతగా ఉన్న బన్నీ వాసు
- శిరీష్ తల్లి గురించిన ప్రస్తావన
- ఆ ఫ్యామిలీతో తనకి గల అనుబంధం గురించిన వివరణ
- తన ఎదుగుదలకి కారకుడు బన్నీ అంటూ వ్యాఖ్య
- తన ప్రాణం ..సర్వం బన్నీనే అని వెల్లడి
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ కి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ బ్యానర్ పై వచ్చే సినిమాలకి సంబంధించిన పూర్తి పర్యవేక్షణ ఆయన వైపు నుంచి ఉంటుంది. అలా గీతా ఆర్ట్స్ సమర్పణలో వచ్చిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా, హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ లో బన్నీ వాసు మాట్లాడుతూ .. "గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంస్థ. అలాగే ఈ సినిమాతోను కొత్త టెక్నీషియన్స్ ను తీసుకొవడం జరిగింది" అన్నారు.
"అల్లు అరవింద్ గారు 70 ఏళ్ల కుర్రాడు .. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుందంటే ఆయన నిద్రపోడు .. మమ్మల్ని నిద్రపోనివ్వడు. తెల్లారితే సినిమా రిలీజ్ .. అయినా కరెక్షన్ జరిగి వెళ్లవలసిందే అనేది ఆయన ఉద్దేశం. ఈ సంస్థ ఇంతగా ఎదగడానికి కారణం .. సక్సెస్ సీక్రెట్ కూడా అదే. శిరీష్ హిట్ కొట్టాలనేది ఆయన అమ్మగారి డ్రీమ్. ఆయనంటే ఆమెకి ఎంత ఇష్టమన్నది నాకు తెలుసు. ఆయన హీరో అవ్వడం వల్లనే, ఆయన ఉండవలసిన ఈ ప్లేస్ లో నేను ఉన్నాను" అని చెప్పారు.
"నా ప్రాణం .. నా స్నేహం .. ఈ రోజున నేను అనేవాడిని ఇక్కడ ఉండటానికి కారకుడు ఆయనే. జీవితంలో నేను ఏది చేసినా .. ఎలా ఉన్నా .. అతను నాతోనే ఉంటాడు. నేను .. ఆయన వేరు అనే ఒక ఆలోచన నాకు ఉండదు. ఎవరైనా నువ్వేం సంపాదించావ్ అని అడిగితే చాలా సంపాదించాను అంటాను. ఎందుకంటే బన్నీ సంపాదించిందంతా నాదనుకుంటాను. ఆయన ఎదిగితే నేను ఎదిగానని అనుకుంటాను" అన్నారు. అయన అలా మాట్లాడుతున్నప్పుడు బన్నీ కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. .
"అల్లు అరవింద్ గారు 70 ఏళ్ల కుర్రాడు .. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుందంటే ఆయన నిద్రపోడు .. మమ్మల్ని నిద్రపోనివ్వడు. తెల్లారితే సినిమా రిలీజ్ .. అయినా కరెక్షన్ జరిగి వెళ్లవలసిందే అనేది ఆయన ఉద్దేశం. ఈ సంస్థ ఇంతగా ఎదగడానికి కారణం .. సక్సెస్ సీక్రెట్ కూడా అదే. శిరీష్ హిట్ కొట్టాలనేది ఆయన అమ్మగారి డ్రీమ్. ఆయనంటే ఆమెకి ఎంత ఇష్టమన్నది నాకు తెలుసు. ఆయన హీరో అవ్వడం వల్లనే, ఆయన ఉండవలసిన ఈ ప్లేస్ లో నేను ఉన్నాను" అని చెప్పారు.
"నా ప్రాణం .. నా స్నేహం .. ఈ రోజున నేను అనేవాడిని ఇక్కడ ఉండటానికి కారకుడు ఆయనే. జీవితంలో నేను ఏది చేసినా .. ఎలా ఉన్నా .. అతను నాతోనే ఉంటాడు. నేను .. ఆయన వేరు అనే ఒక ఆలోచన నాకు ఉండదు. ఎవరైనా నువ్వేం సంపాదించావ్ అని అడిగితే చాలా సంపాదించాను అంటాను. ఎందుకంటే బన్నీ సంపాదించిందంతా నాదనుకుంటాను. ఆయన ఎదిగితే నేను ఎదిగానని అనుకుంటాను" అన్నారు. అయన అలా మాట్లాడుతున్నప్పుడు బన్నీ కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది.