సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాల్లో మార్పునకు ఇది నాంది: మునుగోడు ఫలితంపై హరీశ్ రావు వ్యాఖ్యలు
- మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల గెలుపు
- మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు
- తెలంగాణ ప్రజలు తమవైపే ఉన్నారని వెల్లడి
- బీజేపీ అహంకారాన్ని మునుగోడు ఓటర్లు అణచివేశారంటూ వ్యాఖ్యలు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన అనంతరం మంత్రి హరీశ్ రావు స్పందించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాల్లో మార్పునకు ఈ ఫలితం నాంది పలికిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజానీకం ఎవరి పక్షాన ఉందో ఈ ఉప ఎన్నిక ద్వారా స్పష్టమైందని అన్నారు.
మునుగోడు ప్రజలు బీజేపీ కుట్రలను ఛేదించారని పేర్కొన్నారు. బీజేపీ అహంభావాన్ని మునుగోడు ఓటర్లు అణచివేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ కుట్రలకు మధ్య కొనసాగుతున్న పోరాటంలో మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారని, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. మున్ముందు ప్రజలంతా ఇదే స్ఫూర్తిని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు హరీశ్ రావు వివరించారు.