మునుగోడులో గెలిచింది కూడా ఓ గెలుపేనా?: షర్మిల
- ముగిసిన కౌంటింగ్
- మునుగోడు విజేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
- విమర్శనాస్త్రాలు సంధించిన షర్మిల
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడిన నేపథ్యంలో, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శనాత్మకంగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి, హత్య చేసి, గెలిచామని సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి కేసీఆర్ గారూ! అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఊరికో ఎమ్మెల్యేను పెట్టి, మండలానికి ముగ్గురు మంత్రులను పెట్టి... మద్యం, మనీ పంచి, అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఓటర్లను బెదిరించి, ఫాంహౌస్ డ్రామా ఆడి... కేవలం 10 వేల ఓట్లతో గెలిచిన గెలుపు కూడా ఓ గెలుపేనా? అంటూ షర్మిల విమర్శించారు.
అదే సమయంలో బీజేపీపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొని తెచ్చి, ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీకి నైతికత గురించి మాట్లాడే హక్కులేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి ఇప్పుడైనా సిగ్గువచ్చిందా? దొంగదారి రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరని ఇప్పటికైనా అర్థమైందా? అని వ్యాఖ్యానించారు.