ఇన్నాళ్లకి అల్లు శిరీష్ ఎనర్జీకి తగిన సినిమా పడింది: సునీల్
- ఈ నెల 4వ తేదీన వచ్చిన 'ఉర్వశివో రాక్షసివో'
- అల్లు శిరీష్ సరసన అందాల సందడి చేసిన అనూ ఇమ్మాన్యుయేల్
- తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా
- బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ ను నిర్వహించిన టీమ్
అల్లు శిరీష్ హీరోగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా రూపొందింది. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకి, రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా అలరించిన ఈ సినిమాలో, సునీల్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ నెల 4వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ 'యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్' ఈవెంటును నిర్వహించింది. ఈ వేదికపై సునీల్ మాఅట్లాడుతూ .. " గీతా ఆర్ట్స్ లో మరో సినిమా చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. శిరీష్ తో నాకు మంచి పరిచయం ఉంది. ఆయన పాదరసంలా చాలా స్పీడ్ గా ఉంటూ, చకచకా కౌంటర్లు ఇస్తుంటాడు. ఇంతకాలానికి ఆయన ఎనర్జీకి తగిన సినిమా పడిందని నేను భావిస్తున్నాను. చాలా కాలం తరువాత ఈ సినిమాలో పాత సునీల్ కనిపించాడని అంటున్నారు .. అందుకు సంతోషంగా ఉంది" అని అన్నాడు.
"ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం అల్లు అరవింద్ గారు .. బన్నీ వాసు గారు. ఇక బన్నీ తో కూడా నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచి కూడా బన్నీయే నన్ను నమ్ముతూ వచ్చాడు. 'పుష్ప' సినిమాలో 'మంగళం శ్రీను' పాత్రను నేను చేయగలనా అనుకున్నాను. కానీ నేను చేయగలను అని హండ్రెడ్ పెర్సెంట్ నమ్మకంతో చెప్పిన వ్యక్తి బన్నీ. నా పట్ల శిరీష్ కూడా అంతే అభిమానాన్ని చూపిస్తూ వచ్చాడు. గీతా ఆర్ట్స్ నుంచి ఇంతటి సక్సెస్ ను అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అంటూ ముగించాడు.