మునుగోడు బైపోల్స్: 13వ రౌండ్ తర్వాత 9,136 ఓట్లకు పెరిగిన టీఆర్ఎస్ ఆధిక్యం

  • కొనసాగుతున్న మునుగోడు బైపోల్స్ కౌంటింగ్
  • ఎదురులేని టీఆర్ఎస్
  • దూసుకుపోతున్న కూసుకుంట్ల
  • భారీ తేడాతో వెనుకబడి ఉన్న కోమటిరెడ్డి
  • కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతు!
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 13వ రౌండ్ పూర్తికాగా, టీఆర్ఎస్ పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. 13వ రౌండ్ అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 9,136 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 13వ రౌండ్ లోనూ కారుకే ఆధిక్యం లభించడంతో గులాబీ శ్రేణులు ఆనందంతో పొంగిపోతున్నాయి. 

13వ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 6,940 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 5,406 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఈ రౌండ్ లో కేవలం 521 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

13 రౌండ్ల అనంతరం టీఆర్ఎస్ టోటల్ 88,696 ఓట్లు కాగా, బీజేపీకి 79,604, కాంగ్రెస్ కు 19,415 ఓట్లు లభించాయి. 

కాగా, మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల ట్రెండింగ్ పై తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పందించారు. కేసీఆర్ వెంటే తెలంగాణ అంటూ ప్రజాస్పందన తమకే అనుకూలం అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News