మెల్బోర్న్ లో కేఎల్ రాహుల్ దూకుడు... 14 ఓవర్లలో టీమిండియా స్కోరు 103-4

  • వరల్డ్ కప్ లో చివరి లీగ్ మ్యాచ్
  • టీమిండియా వర్సెస్ జింబాబ్వే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్, జింబాబ్వే జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. రాహుల్ 35 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 3 సిక్సులున్నాయి.

కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులు చేసి ముజరబాని బౌలింగ్ లో అవుటయ్యాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 26 పరుగులు చేశాడు. కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తున్నట్టే కనిపించినా, షాన్ విలియమ్స్ బంతిని కట్ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

అటు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కేవలం 3 పరుగులకే వెనుదిరగడంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 14 ఓవర్లలో 4 వికెట్లకు 103 పరుగులు. సూర్యకుమార్ యాదవ్ (4 బ్యాటింగ్), హార్దిక్ పాండ్యా (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.


More Telugu News