మునుగోడు ఓట్ల లెక్కింపు: రెండో రౌండ్‌లో బీజేపీ ముందంజ.. ఓవరాల్‌గా టీఆర్ఎస్‌కు ఆధిక్యం
- పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు ఆధిక్యం
- రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ముందంజ
- రెండో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్‌కు 14,211 ఓట్లు
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కి ఫలితాలు మారుతుండడంతో ఉత్కంఠగా మారింది. పోస్టల్ బ్యాలెట్, తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఆధిక్యం రాగా, రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనూహ్యంగా ముందంజ వేశారు.
తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 6,096 ఓట్లు రాగా, బీజేపీకి 4,904, కాంగ్రెస్‌కు 1,877 ఓట్లు పోలయ్యాయి. దీంతో తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు వెయ్యికిపైగా ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే, చౌటప్పల్ మండలానికి సంబంధించి లెక్కిస్తున్న రెండో రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి 789 ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే, ఓవరాల్‌గా రెండో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి 563 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్‌కు 14,211, బీజేపీకి 13,648, కాంగ్రెస్‌కు 3,597 ఓట్లు పోలయ్యాయి. దీనిని బట్టి చూస్తుంటే టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా కనిపించడం లేదు.