కొనసాగుతున్న మునుగోడు ఓట్ల లెక్కింపు.. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌దే ఆధిక్యం
- పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఆధిక్యం
- తొలి రౌండ్ ముగిసే సరికి వెయ్యికిపైగా ఓట్ల ఆధిక్యం
- పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీకి 224 ఓట్లు
రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు విడుదలవుతున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, 8.30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్‌కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇందులో టీఆర్ఎస్‌కు 228 ఓట్లు రాగా, బీజేపీకి 224, బీఎస్పీకి 10 ఓట్లు వచ్చాయి. ఇక, తొలి రౌండ్ లెక్కింపు ప్రారంభమయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వెయ్యికిపైగా ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.