భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు అన్ని అడ్డంకులు తొలగాయి: మంత్రి బొత్స సత్యనారాయణ
- భోగాపురం ఎయిర్ పోర్టుపై శుక్రవారం తీర్పు చెప్పిన ఏపీ హైకోర్టు
- హైకోర్టు తీర్పుతో ఎయిర్ పోర్టుకు ఉన్న అడ్డంకులు తొలగాయన్న బొత్స
- ఎయిర్ పోర్టుకు అవసరమైన తదుపరి భూ సేకరణపై అధికారులతో సమీక్ష
- గిరిజన వర్సిటీతో పాటు భోగాపురం ఎయిర్ పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటన
విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు కానున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి నెలకొన్న అడ్డంకులు తొలగిన నేపథ్యంలో త్వరలోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ నెల 11న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ జరపనున్న పర్యటనలో భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన అయితే ఉండదని ఆయన తెలిపారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ శుక్రవారం ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగినట్టేనని మంత్రి బొత్స వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన శనివారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో భోగాపురం ఎయిర్ పోర్టుకు అవసరమైన తదుపరి భూసేకరణపై అధికార యంత్రాంగంతో సమీక్షించారు. త్వరలోనే గిరిజన వర్సిటీతో పాటు భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేస్తామని బొత్స తెలిపారు.