మరో వివాదంలో యంగ్ హీరో విష్వక్సేన్... ఫిల్మ్ చాంబర్ కు ఫిర్యాదు చేయనున్న అర్జున్
- విశ్వక్సేన్ హీరోగా, అర్జున్ కూతురు హీరోయిన్ గా సినిమా
- 3 నెలల క్రితమే సినిమా షూటింగ్ ప్రారంభం
- షూటింగ్ లో విష్వక్సేన్ తీరుపై అర్జున్ బృందం అసంతృప్తి
- షూటింగ్ కు హాజరు కాని విష్వక్సేన్
- అర్జున్ ఫోన్ చేసినా స్పందించని యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. దర్శకుడిగా మారిన సీనియర్ హీరో అర్జున్ తో విభేదాలు ఈసారి విష్వక్సేన్ ను వివాదంలోకి నెట్టాయి. ఈ వివాదంపై శనివారం స్పందించిన అర్జున్... విష్వక్సేన్ పై ఫిలిం చాంబర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. అర్జున్ కూతురు ఐశ్వర్య, విష్వక్సేన్ జంటగా స్వీయ దర్శకత్వంలో అర్జున్ ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కు హాజరు కాబోనంటూ విష్వక్సేన్ మొండికేయడంతో ఈ వివాదం మొదలైనట్లుగా అర్జున్ చెబుతున్నారు.
ఈ చిత్రం షూటింగ్ 3 నెలల క్రితమే మొదలైంది. అయితే కారణం తెలియదు కానీ, షూటింగ్ కు విష్వక్సేన్ హాజరు కావడం లేదట. దీంతో షూటింగ్ కు రావాలంటూ అర్జున్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను స్పందించలేదట. అంతేకాకుండా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మొత్తాన్ని మార్చేస్తే గానీ తాను షూటింగ్ కు రానని విష్వక్సేన్ చెబుతున్నాడట. దీంతో విష్వక్సేన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా కొన్ని వార్తా సంస్థలు వార్త రాసేశాయి. ఈ వార్త చూసిన అర్జున్ జరిగిన విషయంపై వివరణ ఇచ్చారు.
తెలుగు సినిమా పరిశ్రమకు తన కూతురు ఐశ్వర్యను పరిచయం చేస్తూ ఓ సినియా తీయాలనుకున్నానని అర్జున్ చెప్పారు. ఈ క్రమంలో ఓ కథను సిద్ధం చేసి విష్వక్సేన్ ను సంప్రదించగా... కథ తనకు బాగా నచ్చిందని విష్వక్సేన్ చెప్పారన్నారు. ఇక రెమ్యూనరేషన్ విషయంలో విష్వక్సేన్ చెప్పినట్లుగానే ఒప్పందం చేసుకున్నామన్నాడు. అయితే షూటింగ్ లో విష్వక్సేన్ ప్రవర్తనతో తన బృందం బాగా ఇబ్బంది పడిందన్నారు.
అంతేకాకుండా ఈ విషయంపై మాట్లాడేందుకు విష్వక్సేన్ కు ఫోన్ చేయగా... ఆయన అసలు స్పందించనే లేదన్నారు. తన జీవితంలో విష్వక్సేన్ కు చేసినన్ని ఫోన్లు ఎవరికీ చేయలేదన్నారు. అయినా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ను పూర్తిగా మార్చేయాలని చెబితే ఎలా? అని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తాను ఫిలిం చాంబర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు అర్జున్ చెప్పారు.