సమంత కెరియర్లో 'యశోద' ప్రత్యేక సినిమా అవుతుందా?
- 'యశోద'గా కనిపించనున్న సమంత
- సరోగసి నేపథ్యంలో నడిచే కథ
- సమంత నటనకు ఈ సినిమా ఒక గీటురాయి అంటూ టాక్
- ఆమె స్థాయి మరింత పెరగడం ఖాయమంటూ వినిపిస్తున్న అభిప్రాయాలు
- ఈ నెల 11వ తేదీన 5 భాషల్లో విడుదలవుతున్న సినిమా
ఎలాంటి సినిమా నేపథ్యంలేని ఫ్యామిలీ నుంచి సమంత ఇండస్ట్రీకి వచ్చింది. కెరియర్ ను మొదలెట్టిన తరువాత టాప్ హీరోయిన్స్ రేసులో జాయిన్ కావడానికి ఆమె ఎక్కువగా సమయం తీసుకోలేదు. గ్లామర్ తో పాటు నటనతోను ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా తోడుకావడంతో, తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఆమె చక్రం తిప్పేసింది. కొంతకాలం వరకూ హీరోల జోడీగా ఆడిపాడుతూ అల్లరి చేసిన సమంత, ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ పాత్రలపై దృష్టి పెట్టింది.
అలా సమంత వరుసగా 'యూ టర్న్' ..'ఓ బేబీ' .. 'జాను' సినిమాలు చేస్తూ వెళ్లింది. మొదటి రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లను నమోదు చేశాయి. ఆ తరువాత ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చేసింది. ఈ సినిమాకి గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సమంత సినిమా కోసం అప్పటివరకూ వెయిట్ చేయక తప్పదేమోనని అంతా అనుకున్నారు. కానీ ఈ లోగానే సమంత 'యశోద' సినిమాను పూర్తి చేయడం విశేషం.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అమాంతంగా అంచనాలు పెంచేసింది. సరోగసి పేరుతో జరుగుతున్న బిజినెస్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. యశోద అనే పాత్రలో సమంత కనిపించనుంది. తన కడుపులో ఒక బిడ్డను మోస్తున్న యశోద, తన చుట్టూ ఏదో జరుగుతుందని గ్రహిస్తుంది. ఆవేదన .. ఆక్రోశం .. భయం .. దుఃఖం .. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగబడే యశోద పాత్రలో సమంత ఎక్స్ ప్రెషన్స్ కి ఇప్పటికే పొలోమంటూ ఓట్లు పడిపోయాయి. సమంత కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగిన స్థాయిలో నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. సమంత నటనకు ఇది ఒక గీటురాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. .
అలా సమంత వరుసగా 'యూ టర్న్' ..'ఓ బేబీ' .. 'జాను' సినిమాలు చేస్తూ వెళ్లింది. మొదటి రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లను నమోదు చేశాయి. ఆ తరువాత ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చేసింది. ఈ సినిమాకి గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సమంత సినిమా కోసం అప్పటివరకూ వెయిట్ చేయక తప్పదేమోనని అంతా అనుకున్నారు. కానీ ఈ లోగానే సమంత 'యశోద' సినిమాను పూర్తి చేయడం విశేషం.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అమాంతంగా అంచనాలు పెంచేసింది. సరోగసి పేరుతో జరుగుతున్న బిజినెస్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. యశోద అనే పాత్రలో సమంత కనిపించనుంది. తన కడుపులో ఒక బిడ్డను మోస్తున్న యశోద, తన చుట్టూ ఏదో జరుగుతుందని గ్రహిస్తుంది. ఆవేదన .. ఆక్రోశం .. భయం .. దుఃఖం .. తప్పనిసరి పరిస్థితుల్లో తిరగబడే యశోద పాత్రలో సమంత ఎక్స్ ప్రెషన్స్ కి ఇప్పటికే పొలోమంటూ ఓట్లు పడిపోయాయి. సమంత కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగిన స్థాయిలో నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. సమంత నటనకు ఇది ఒక గీటురాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.