నువ్వు పతనావస్థకు చేరుకున్నావు కాబట్టే దేవుడ్ని అవమానించావు: దేవిశ్రీప్రసాద్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు
- 'ఓ పిల్లా' ఆల్బమ్ సాంగ్ చేసిన దేవిశ్రీ
- వివాదాస్పదమైన పాట.. దేవిశ్రీపై కేసు నమోదు
- దేవిశ్రీ వ్యాఖ్యల వీడియో పంచుకున్న విష్ణువర్ధన్ రెడ్డి
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రూపొందించిన 'ఓ పిల్లా' అనే ఆల్బమ్ సాంగ్ వివాదాస్పదం కావడం తెలిసిందే. హరే రామ హరే కృష్ణ అనే భజనను దేవిశ్రీప్రసాద్ ఐటెం సాంగ్ లో వాడుకున్నారంటూ హిందుత్వ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆయనపై ఇప్పటికే కేసు కూడా నమోదైంది.
ఈ క్రమంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి కూడా దేవిశ్రీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "నువ్వు పతనావస్థకు చేరుకున్నావు కాబట్టే కొండను, కొండ మీద ప్రసాదాన్ని అవమానించి పాట పాడావు" అని విమర్శించారు. "దేవుడిని అవమానించిన పాట నీకు డివోషనల్ అనిపించిందా?" అంటూ నిలదీశారు. గతంలో ఓ సినీ ఫంక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ ఐటెం సాంగ్ ట్యూన్లతో భక్తిగీతాలు పాడిన వీడియోను కూడా విష్ణువర్ధన్ రెడ్డి పంచుకున్నారు.
కొన్నిరోజుల కిందట కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఈ పాటపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవిత్ర హిందూ మంత్రాలను బికినీలు ధరించిన అమ్మాయిలు డ్యాన్సు చేస్తున్న పాటలో ఉపయోగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.