క్వింటాల్ వరి ధాన్యానికి రూ. 2,060గా ధరను నిర్ణయించాం: హరీశ్ రావు

  • సిద్ధిపేట జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామన్న హరీశ్
  • ఎఫ్సీఐ నుంచి డబ్బులు రాకపోయినా వరిని కొంటున్నామని వ్యాఖ్య
  • పామ్ ఆయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలని సూచన
తెలంగాణ దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మారిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిధ్దిపేట జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేశామని వెల్లడించారు. క్వింటాల్ వరి ధాన్యానికి రూ. 2,060గా ధరను నిర్ణయించామని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. ఎఫ్సీఐ నుంచి డబ్బులు రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తుందని చెప్పారు. 

పామ్ ఆయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలని హరీశ్ అన్నారు. ఈ పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. ఇదే సమయంలో బీజేపీపై హరీశ్ రావు మండిపడ్డారు. వడ్లు కొనడం చేత కాకపోయినా... వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను బీజేపీ కొంటోందని అన్నారు. నంగునూరు మండలం సిద్ధన్నపేట మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News