గీతూ చేసింది తప్పే.. కానీ ఆదిరెడ్డి ఆట ఆడకూడదు: బిగ్ బాస్ చెప్పిందే ఫైనల్

  • గీతూ శ్రమ వృథా అంటూ తేల్చేసిన బిగ్ బాస్ 
  • ఆదిరెడ్డి ఆడటానికి వీల్లేదంటూ మందలింపు 
  • మైక్ ను డ్యామేజ్ చేయడమే కారణమన్న బిగ్ బాస్ 
  • గీతూను సున్నితంగానే హెచ్చరించిన ఆదిరెడ్డి  
60వ రోజున కూడా రెడ్ టీమ్ - బ్లూ టీమ్ మధ్య గేమ్ కొనసాగింది. రెడ్ టీమ్ కి చెందిన గీతూ .. బ్లూ టీమ్ కి చెందిన ఆదిరెడ్డి మధ్య గొడవ తారస్థాయికి చేరుకుంది. గీతూ ఆటతీరును ఆదిరెడ్డి తప్పుబట్టాడు. తాను నిద్రపోతున్న సమయంలో, తన డ్రెస్ ను దొంగిలించడం కరెక్టు కాదంటూ గీతూపై మండిపడ్డాడు. ఆ సమయంలో అతను తన టీషర్ట్ తీసేసి నేలకి విసిరికొట్టాడు. ఇక తాను గేమ్ ఆడననీ .. ఈ విషయంలో ఎవరు చేసింది కరెక్ట్ అనే విషయం తేలవలసిందే అంటూ పట్టుబట్టాడు. బాలాదిత్య ఎంతగా నచ్చజెప్పినా అతను వినిపించుకోలేదు. 

చివరికి బిగ్ బాస్ ఆదేశంతో అందరూ హాల్లోకి చేరుకున్నారు. "గీతూ ఆల్రెడీ డెవిల్ గా మారిపోయింది కనుక, ఆమెకి ఆట ఆడే అర్హత లేదు. అందువలన ఆమె ఆదిరెడ్డి స్ట్రైప్స్ ను కాజేయడం వలన ప్రయోజనంలేదు. గీతూ వలన ఆదిరెడ్డి ఈ గేమ్ లో నుంచి బయటికి వెళ్లవలసిన అవసరం లేదు. కానీ అతను తన కోపంతో బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీ అయిన మైక్ ను నేలకేసి కొట్టి డ్యామేజ్ చేశాడు. అందువలన అతనిని ఈ గేమ్ నుంచి తప్పించడం జరుగుతోంది" అంటూ బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. తాను టీషర్ట్ ను నేలకేసి కొట్టాననీ .. ఆ సమయంలో మైక్ నేలకి తాకిందని ఆదిరెడ్డి ఎంతగా చెప్పినా బిగ్ బాస్ వినిపించుకోలేదు.

ఆ రాత్రి అంతా ఈ సంఘటన గురించే గీతూ ఆలోచిస్తూ కూర్చుంది. ఆదిరెడ్డి విషయంలో తాను తప్పు చేశాననీ, అతను ఆట నుంచి వెళ్లిపోవడానికి తానే కారణమని భావించి బాధపడుతుంది. ఆదిరెడ్డికి సారీ చెప్పేవరకూ తనకి మనశ్శాంతి లేదనుకుంటూ వెళ్లి, అతణ్ణి నిద్రలో నుంచి లేపుతుంది. జరిగినదానికి అతనికి సారీ చెబుతుంది. అయితే తనని నమ్మించి మోసం చేసిన ఆమెను ఆ స్థాయిలోనే దెబ్బ కొడతాననీ, చివరి నిమిషం వరకూ ఆమెకి ఆ విషయం తెలియకుండా తాను గేమ్ ఆడతానని ఆదిరెడ్డి కూల్ గానే హెచ్చరించడం  కొసమెరుపు.


More Telugu News