411 రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి
- ఫస్ట్ వేవ్ సమయంలో కరోనా బారిన పడ్డ బ్రిటన్ వ్యక్తి
- అప్పటి నుంచి చికిత్స పొందుతున్న వైనం
- చనిపోతాడనుకున్న వ్యక్తిని బతికించామన్న వైద్యులు
కరోనా మహమ్మారి గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఓ వ్యక్తి కరోనా నుంచి బయటపడటానికి సుదీర్ఘంగా మహమ్మారితో పోరాడాడు. ఏకంగా 411 రోజుల పాటు కరోనాకు ట్రీట్మెంట్ తీసుకున్నాడు.
బ్రిటన్ కు చెందిన 59 ఏళ్ల వ్యక్తికి 2020 డిసెంబర్ లో ఫస్ట్ వేవ్ లో కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూనే ఉన్నారు. పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ (లాంగ్ కోవిడ్) కారణంగా ఆయన బాధపడ్డారు. వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధిని నయం చేశామని బ్రిటన్ వైద్యులు తెలిపారు. చనిపోతాడనుకున్న వ్యక్తిని బతికించామని చెప్పారు.