సైనికుల కొత్త యూనిఫాంపై భారత సైన్యానికి పేటెంట్ హక్కులు

  • భారత సైనికులకు కొత్త యూనిఫాం
  • మారిన డిజైన్.. పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు 
  • ఆమోదం తెలిపిన పేటెంట్స్ కార్యాలయం
మారిన పరిస్థితులకు అనుగుణంగా భారత సైనికులకు కొత్త యూనిఫాం అందిస్తున్న సంగతి తెలిసిందే. తేలికగా ఉంటూ, అత్యంత మన్నిక కలిగిన రీతిలో ఈ దుస్తులను రూపొందించారు. గతంతో పోల్చితే నూతన యూనిఫాం డిజైన్ కూడా మార్చారు. ఈ నేపథ్యంలో, భారత సైన్యం ఈ కొత్త యూనిఫాంపై పేటెంట్ హక్కులు పొందింది. 

కోల్ కతాలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స, ట్రేడ్ మార్క్స్ కార్యాలయంలో భారత సైన్యం దరఖాస్తు చేసుకోగా, గత నెల 31న దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలను పేటెంట్ కార్యాలయ జర్నల్ లో ప్రచురించారు.

ఇక నుంచి సైనికుల యూనిఫాంకు సంబంధించి అన్ని రకాల మేధోపరమైన హక్కులు భారత సైన్యం వద్దే ఉంటాయి. భారత సైన్యం అనుమతి ఉంటే తప్ప ఇంకెవరూ ఈ యూనిఫాంను తయారుచేయడం వీలుకాదు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి తయారుచేస్తే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.


More Telugu News