సూపర్ మెటియోర్-650 బైకు టీజర్ ను విడుదల చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్
- రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త మోడల్
- వచ్చే వారం ఆవిష్కరణ
- మిలాన్ మోటార్ షోలో ప్రదర్శన
- బైక్ వెనుక భాగంతో టీజర్ విడుదల
మోటార్ సైకిల్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ వచ్చేవారం తన కొత్త బైకు సూపర్ మెటియోర్-650ని ఆవిష్కరించనుంది. ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగే ఈఐసీఎంఏ-2022 మోటార్ షోలో ఈ మోడల్ ను ప్రదర్శించనుంది. ఈ నేపథ్యంలో నూతన బైకుకు సంబంధించి ఓ టీజర్ ను విడుదల చేసింది. అందులో బైకు వెనుక భాగాన్ని మాత్రమే పంచుకుంది.
కాగా, ఈ మోడల్ కు రాయల్ ఎన్ ఫీల్డ్ అధికారికంగా పేరు పెట్టలేదు. ప్రస్తుతానికి దీన్ని సూపర్ మెటియోర్-650గా పిలుస్తున్నారు. ఇది 2023 మొదట్లో భారత మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. టియర్ డ్రాప్ ఆకృతిలోని ఫ్యూయల్ ట్యాంక్, సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్, టెయిల్ ల్యాంపులు, వెడల్పాటి హ్యాండిల్ బార్, స్ల్పిట్ సీటింగ్, డ్యూయల్ ఎగ్జాస్ట్, ట్రిప్పర్ నావిగేషన్ తో కూడిన సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ వంటి ఫీచర్లు దీనిలో పొందుపరిచారు.
ఇది 648 సీసీ పార్లల్ ట్విన్ ఇంజిన్స్, 6 స్పీడ్ గేర్ బాక్స్, స్లిప్పర్ క్లచ్ తో వస్తోంది. డ్యూయల్ చానెల్ ఏబీఎస్ బ్రేకింగ్ ద్వారా భద్రతకు పెద్దపీట వేశారు. ఫ్రంట్ ఇన్వెర్టెడ్ ఫోర్క్స్-ట్విన్ షాక్ అబ్జార్బర్స్ తో కుదుపుల్లేని ప్రయాణానికి వీలు కల్పిస్తుంది.
ఈ సూపర్ మెటియోర్-650 భారత మార్కెట్లో రూ.3.5 లక్షలు (ఎక్స్ షోరూం) ధర ఉండొచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.