బంగ్లాదేశ్ సోదరులారా... ఇలాగైతే ఎదగలేరు: హర్షా భోగ్లే

  • కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ బంగ్లాదేశ్ అభిమానుల విమర్శలు
  • ఓటమికి సాకులు వెతకొద్దన్న హర్షా భోగ్లే
  • సాకులు వెతుక్కుంటూ పోతే ఎదగలేరని వ్యాఖ్య
టీ20 ప్రపంచకప్ లో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వల్ల తమకు 5 పరుగులు రాలేదని బంగ్లా క్రికెటర్ నూరుల్ హసన్ విమర్శించారు. ఈ అంశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. బంగ్లా అభిమానులు కూడా ఈ అంశంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందిస్తూ... ఓటమికి సాకులు వెతకడాన్ని బంగ్లా అభిమానులు వదిలేయాలని... అప్పుడే ఎదుగుతారని చెప్పారు. ఫేక్ ఫీల్డింగ్ ను ఎవరూ చూడలేదని హర్ష అన్నారు. బ్యాట్స్ మెన్లు కానీ, అంపైర్లు కానీ చివరకు కామెంటేటర్లు కూడా దాన్ని గమనించలేదని చెప్పారు. నిబంధనల ప్రకారం రూల్ 41.5 ప్రకారం ఫేక్ ఫీల్డింగ్ కు పాల్పడితే జరిమానా విధించే అధికారం అంపైర్లకు ఉందని తెలిపారు. 

వర్షం ఆగిపోయిన తర్వాత మ్యాచ్ ను పునఃప్రారంభించేదుకు అంపైర్లు, క్యూరేటర్లు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఓటమికి సాకులు వెతికే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. టాప్ బ్యాట్స్ మెన్లలో ఒక్కరు చివరి వరకు నిలిచినా బంగ్లాదేశ్ గెలిచేదని చెప్పారు. ఈ విషయాన్నే ఓటమికి కారణంగా భావించాలని అన్నారు. సాకులు వెతుక్కుంటూ పోతే ఎదగలేరని చెప్పారు.


More Telugu News