ట్రంప్ ట్విట్టర్ లోకి రావాలనుకుంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే!
- తగిన విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉందన్న మస్క్
- అందుకు కొన్ని వారాల సమయం పడుతుందని వెల్లడి
- నిషేధానికి గురైన వారు అప్పుడే తిరిగి రాగలరని స్పష్టీకరణ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తిరిగి ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పైకి తీసుకురానున్నట్టు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ గత వారం ప్రకటించారు. కాకపోతే ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పైకి ట్రంప్ ఎంట్రీ ఇచ్చేందుకు మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ఎందుకంటే మాటల్లో చెప్పినంత సులువు కాదు ఆచరణ. ఇందుకు ట్విట్టర్ తన పాలసీలో మార్పులు చేసుకోక తప్పదు. నిబంధనలు ఉల్లంఘించారన్న నెపంతో 2021 జనవరిలో ట్రంప్ పై ట్విట్టర్ నిషేధం విధించింది.
నిషేధానికి గురైన వారు తిరిగి ట్విట్టర్ పైకి వచ్చేందుకు మరికొన్ని వారాల పాటు వేచి చూడాలని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం ట్విట్టర్ నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు. ‘‘స్పష్టమైన విధానాన్ని రూపొందించుకునేంత వరకు.. లోగడ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల నిషేధానికి గురైన వారిని ట్విట్టర్ అనుమతించదు. ఇందుకు కొన్ని వారాల సమయం తీసుకుంటుంది’’ అని మస్క్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్ష కార్యాలయంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేయగా, దీన్ని సమర్థిస్తూ 2021 జనవరిలో ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై నిషేధం పడింది.