విషపూరితమైన మొక్కను తెచ్చి ఇంట్లో పెంచుకుంటున్న వ్యక్తి.. కారణమేమిటంటే..!
- ఈ మొక్క ముళ్లను తాకితే యాసిడ్ గాయమే
- వారాల తరబడి నొప్పి బాధిస్తూనే ఉంటుందట
- దీని చుట్టుపక్కల ఉంటే ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతాయంటున్న సైంటిస్టులు
ఇంట్లో బోర్ కొడుతుంటే టీవీ చూడడమో, సంగీతం వినడమో చేస్తుంటాం.. అయినా సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక బోర్ కొడుతోందనే మాటే వినిపించట్లేదు. బ్రిటన్ కు చెందిన ఓ టీచర్ మాత్రం తన బోర్ డమ్ ను పోగొట్టుకోవడానికి ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్కను తెచ్చి ఇంట్లోనే పెంచుతున్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తన ప్రాణం పోవచ్చని తెలిసి మరీ ఆస్ట్రేలియా నుంచి విత్తనాలు తెప్పించుకుని ఈ మొక్కను పెంచుతున్నాడు.
జింపీ జీంపీ గా పిలిచే ఈ మొక్క ఎంత ప్రమాదకరమైందంటే.. యాసిడ్ ఒంటి మీద పడినపుడు కరెంట్ షాక్ కూడా తగిలితే ఎంత నొప్పి పుడుతుందో ఈ మొక్క ముళ్లు గుచ్చుకున్నా అంతే నొప్పి కలుగుతుందట. అంతేకాదు.. ఆ నొప్పి ఒకటీ రెండు క్షణాల్లో తగ్గిపోదని, రోజులు, వారాలపాటు ఉంటుందని గతంలో దీని బారిన పడ్డవాళ్లు చెప్పారు. కొన్ని సందర్భాల్లో నెలల తరబడి నొప్పి తగ్గకుండా ఉందని వివరించారు. ఈ మొక్క ఉన్నచోట తరచుగా గడిపితే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయని కొన్ని పరిశోధనలలో వెల్లడైంది.
బ్రిటన్ కు చెందిన ఆన్ లైన్ ట్యూటర్ డేనియల్ ఎమ్లిన్ జోన్స్ తన ఇంట్లో ఈ ప్రమాదకరమైన మొక్కను పెంచుతున్నాడు. ఇందుకోసం తన ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపాడు. ఓ పంజరాన్ని తయారు చేయించి, దానికి డేంజర్ బోర్డు తగిలించి జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపాడు. ఆస్ట్రేలియన్ స్టింగింగ్ ట్రీ అని కూడా వ్యవహరించే ఈ మొక్క గురించి వివరాలన్నీ తెలుసుకున్నాకే ఆస్ట్రేలియా నుంచి విత్తనాలు తెప్పించుకున్నట్లు వివరించాడు.