రష్మీ వేరే లెవెల్ అంతే!: హీరో నందూ

  • నందూ హీరోగా రూపొందిన 'బొమ్మ బ్లాక్ బస్టర్'
  • కథానాయికగా అలరించనున్న రష్మీ 
  • హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ముఖ్య అతిథిగా వచ్చిన నాగశౌర్య
  • ఈ నెల 4వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా 
నందు - రష్మీ జంటగా 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా రూపొందింది. ప్రవీణ్ పగడాల నిర్మించిన ఈ సినిమాకి రాజ్ విరాట్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ యాక్షన్ జోనర్లో ఈ సినిమా నిర్మితమైంది. రఘు కుంచె .. కిరీటి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదు - మాదాపూర్ లోని 'వి కన్వెన్షన్' లో నిర్వహించారు. నాగశౌర్య ముఖ్య అతిథిగా ఈ వేడుక జరిగింది. 

ఈ వేదికపై నందూ మాట్లాడుతూ .. "సినిమాల కోసం చాలామందిని కలిశాను. అందరూ కూడా నాకు ఒక మంచి సినిమాపడితే బాగుంటుందని అన్నవారేగానీ .. అవకాశం మాత్రం ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ కథను .. ఈ దర్శకుడిని తీసుకుని చాలామంది నిర్మాతలను కలిశాను. వాళ్లంతా కూడా పెద్ద హీరోతో చేసుకుంటాము .. కథ ఇచ్చేయి అన్నారు. అప్పుడు నా సినిమా కోసం నేనే నిర్మాతగా మారాను. మధ్యలో ప్రవీణ్ పగడాల మిత్రులు నిర్మాతలుగా ముందుకు వచ్చారు.

సినిమా పట్ల గల ప్యాషన్ తో .. నా పట్ల గల అభిమానంతో చాలామంది పనిచేశారు. రష్మీ నాకు మాత్రమే కాదు .. నా వైఫ్ కి కూడా ఫ్రెండే. కథ కూడా వినకుండా తను ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది. తాను ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆటోల్లో తిరిగింది. తనకి నేను ఒక్క రూపాయి ఇవ్వకపోయినా నా కోసం కష్టపడింది. తను లేకుండా ఈ సినిమాను గురించి నేను ఆలోచించలేను. రష్మీ వేరే లెవెల్ అంతే. ఇక ఒకే ఒక మెసేజ్ తో ఈ సినిమా ఈవెంటుకు వచ్చిన నాగశౌర్యకి థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించాడు.  



More Telugu News