త్వరలో కుమార్తె వివాహం... సీఎం జగన్ కు శుభలేఖ అందించిన అలీ దంపతులు
- సీఎం జగన్ ను కలిసిన అలీ, జుబేదా
- కుమార్తె పెళ్లికి రావాలంటూ ఆహ్వానం
- ప్రభుత్వ పదవి ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన అలీ
- సీఎం జగన్ ప్రజల మనిషి అని కితాబు
- బూతులు తిట్టడం రాజకీయం కాదని సూచన
టాలీవుడ్ కమెడియన్, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ నేడు సతీసమేతంగా సీఎం జగన్ ను కలిశారు. త్వరలో జరగనున్న తమ కుమార్తె వివాహానికి రావాలంటూ సీఎం జగన్ ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు శుభలేఖ అందించారు. అంతేకాదు, తనకు ప్రభుత్వంలో సలహాదారు పదవి ఇవ్వడం పట్ల కూడా సీఎంకు అలీ కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంను కలిసిన అనంతరం అలీ మీడియాతో మాట్లాడారు. సీఎం తనకు కేటాయించిన బాధ్యతలను నిర్వర్తిస్తానని, ఇక నుంచి మరో అలీని చూస్తారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మొత్తం 175 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ను ప్రజలు నమ్ముతున్నారని, ఆ నమ్మకంతోనే 151 సీట్లు ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో గెలిపిస్తారని వివరించారు.
ఇక ఇటీవల పరిణామాలపైనా అలీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. బూతులు తిట్టడమే రాజకీయాలు అనుకోవడం సరికాదని హితవు పలికారు. సహనం కోల్పోయి మాట్లాడితే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు.