యూవీ క్రియేషన్స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన జీఎస్టీ నిఘా విభాగం
- ఆదాయానికి, జీఎస్టీ చెల్లింపులకు మధ్య వ్యత్యాసం
- మంగళవారం ఉదయం నుంచి సోదాలు
- రూ.6 కోట్ల బకాయిలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తింపు
- పలు రికార్డులు స్వాధీనం చేసుకున్న జీఎస్టీ అధికారులు
టాలీవుడ్ లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. అయితే ఈ సంస్థకు వస్తున్న ఆదాయానికి, జీఎస్టీ చెల్లింపులకు పొంతన కుదరడంలేదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని యూవీ క్రియేషన్స్ కార్యాలయంలో జీఎస్టీ నిఘా విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు.
యూవీ క్రియేషన్స్ కార్యాలయం కావూరి హిల్స్ ప్రాంతంలో ఉంది. మంగళవారం ఉదయం నుంచి గత అర్ధరాత్రి వరకు జీఎస్టీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల ప్రాథమిక పరిశీలనలో యూవీ క్రియేషన్స్ రూ.6 కోట్లకు పైన జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తించారు. రికార్డులన్నీ పరిశీలిస్తే బకాయిలపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
యూవీ క్రియేషన్స్ ప్రభాస్ కజిన్ బ్రదర్ ప్రమోద్ ఉప్పలపాటికి చెందినదన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణ సంస్థలో వంశీకృష్ణారెడ్డి, విక్రమ్ కృష్ణారెడ్డి భాగస్వాములుగా ఉన్నారు. కాగా, జీఎస్టీ అధికారుల సోదాలపై యూవీ క్రియేషన్స్ వర్గాలు స్పందిస్తూ, ఇవి సాధారణ తనిఖీలేనని పేర్కొన్నాయి.