జనసేన రాజకీయ పార్టీ కాదు.. సినిమా పార్టీ: మంత్రి అమర్‌నాథ్
- పవన్, చంద్రబాబు కలయికను ముందే ఊహించామన్న మంత్రి
- సినిమా స్టయిల్లో మాట్లాడితే ప్రయోజనం ఉండదని ఎద్దేవా
- కాపులకు పవన్ ధర్మకర్త కాదన్న అమర్‌నాథ్
పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీపై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న విశాఖపట్టణంలో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ.. జనసేనకంటూ ప్రత్యేకంగా విధానాలు, సిద్ధాంతాలు ఏవీ లేవని విమర్శించారు. ప్రజలకు ఏమి చేయాలన్న ఆలోచన కూడా ఆ పార్టీకి లేదని ధ్వజమెత్తారు. జనసేన రాజకీయ పార్టీ కాదని, సినిమా పార్టీ అని అభివర్ణించారు.
సినిమా స్టయిల్లో మాట్లాడితే అది సినిమాకు పనికొస్తుంది కానీ ప్రజస్వామ్యంలో ప్రయోజనం ఉండదన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలయికను ఎప్పుడో ఊహించామన్నారు. వైసీపీకి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే గతంలో విడిపోయిన వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారని అన్నారు. పవన్‌కు ఇప్పుడే కాపులు, ముద్రగడ, వంగవీటి రంగా ఎందుకు గుర్తొచ్చారని ప్రశ్నించారు. కాపులకు పవన్ ఏమీ ధర్మకర్త కాదని మంత్రి పేర్కొన్నారు.