మరో రూ.1,413 కోట్ల రుణం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
- ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలానికి హాజరైన ఏపీ
- ఏడేళ్ల కాల వ్యవధికి 7.75 శాతం వడ్డీతో రూ.700 కోట్ల రుణం సేకరణ
- మరో రూ.713 కోట్లను 11 ఏళ్ల కాల వ్యవధికి 7.86 శాతం వడ్డీకి సేకరణ
ఏపీ ప్రభుత్వం తాజాగా మంగళవారం మరో రూ.1,413 కోట్ల రుణాన్ని సేకరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్బీఐ) నేతృత్వంలో జరిగిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో మంగళవారం పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాన్ని సేకరించింది. ప్రతి మంగళవారం ఆర్బీఐ ఆధ్వర్యంలో సెక్యూరిటీ బాండ్ల వేలం జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా మంగళవారం జరిగిన సెక్యూరిటీ బాండ్ల వేలానికి హాజరైన ఏపీ... రెండు విభాగాలుగా రూ.1,413 కోట్ల రుణాన్ని సేకరించింది. ఇందులో రూ.700 కోట్లను ఏడేళ్ల కాల వ్యవధికి 7.75 శాతం వడ్డీతో సేకరించింది. అదే సమయంలో మరో రూ.713 కోట్లను 11 ఏళ్ల కాల వ్యవధికి 7.86 శాతం వడ్డీకి సేకరించింది.