తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ చైర్మన్ల భేటీ... ఆర్టీసీ సేవలపై చర్చ
- హైదరాబాద్ వచ్చిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి
- టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఇంటికి వెళ్లిన మల్లికార్జున రెడ్డి
- ఇరు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య మరింత మంచి సంబంధాల దిశగా చర్చలు
తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల చైర్మన్లు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మల్లికార్జున రెడ్డిలు మంగళవారం భేటీ అయ్యారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి మంగళవారం హైదరాబాద్ కు వచ్చారు. ఆయన నేరుగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మల్లికార్డునరెడ్డికి బాజిరెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సేవలపై చర్చించుకున్నట్లు బాజిరెడ్డి ప్రకటించారు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత అప్పటిదాకా ఉమ్మడి సంస్థగా ఉన్న ఆర్టీసీ రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇరు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు తిరిగేలా ఒప్పందాలు కుదిరాయి. తాజాగా రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య మరింత మంచి సంబంధాల దిశగా ఇరు రాష్ట్రాల ఆర్టీసీ చైర్మన్లు చర్చలు జరిపారు.