చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే వైసీపీకి భవిష్యత్తు ఉండదు: జ్యోతుల నెహ్రూ
- కాపులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్న నెహ్రూ
- కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపాటు
- చంద్రబాబును కాపులకు శత్రువుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ
రాజమండ్రిలో వైసీపీ కాపు మంత్రులు నిర్వహించిన సమావేశంతో కాపు సామాజికవర్గానికి ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. కాపు సామాజికవర్గాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఈ సమావేశాన్ని నిర్వహించారని మండిపడ్డారు. కాపులను రెచ్చగొట్టేలా కాపు మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు.
వంగవీటి రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీలోనే ఉన్నాడనే విషయాన్ని ఆ పార్టీలోని కాపు నేతలు మర్చిపోకూడదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును కాపులకు శత్రువుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు చంద్రబాబు హయాంలో ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే వైసీపీకి భవిష్యత్తు ఉండదని అన్నారు.