'వైన్' యాప్ ను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ఎలాన్ మస్క్ సన్నాహాలు!
- ట్విట్టర్ ను చేజిక్కించుకున్న ఎలాన్ మస్క్
- ట్విట్టర్ అధీనంలో 'వైన్' యాప్
- ఆరేళ్ల కిందట మూతపడిన 'వైన్'
- ఈ ఏడాది చివరినాటికి సిద్ధం చేసేందుకు మస్క్ ప్రణాళికలు
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకోవడం తెలిసిందే. ట్విట్టర్ ను ప్రక్షాళన చేయడంతో పాటే ఆయన మరో ఆలోచన కూడా చేస్తున్నారు. ట్విట్టర్ అధీనంలో ఉన్న షార్ట్ వీడియో వేదిక 'వైన్' ను మళ్లీ తెరపైకి తీసుకురావాలని సంకల్పించారు.
వైన్ యాప్ కూడా టిక్ టాక్ వంటిదే. టిక్ టాక్ కంటే ముందే 'వైన్' 2012లో వచ్చింది. తదనంతర కాలంలో దీన్ని ట్విట్టర్ చేజిక్కించుకుంది. ప్రజాదరణ లేక ఆరేళ్ల కిందట 'వైన్' మూలనపడింది. ప్రస్తుతం షార్ట్ వీడియో వేదికగా టిక్ టాక్ విశేష ప్రజాదరణ సొంతం చేసుకుంది.
కానీ ఎలాన్ మస్క్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. 'వైన్' పుంజుకునేందుకు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. వైన్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసి ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేయాలని ట్విట్టర్ ఇంజినీర్లను ఆదేశించినట్టు తెలుస్తోంది.
అయితే, 'వైన్' ను పునఃప్రారంభించడం అంత సులువేమీ కాదని, అందుకు చాలా శ్రమించాల్సి ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కృత్రిమ మేధకు సంబంధించిన టెక్నాలజీతో వైన్ సాఫ్ట్ వేర్ ను అనుసంధానం చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఒకవేళ మస్క్ 'వైన్' ను తీసుకువచ్చినా, టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కు పోటీ ఇవ్వగలదా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.