మా నాన్న ఉంటే బాగుండేది: హీరో సంతోష్ శోభన్
- సంతోష్ శోభన్ నుంచి మరో విభిన్న చిత్రం
- కథానాయికగా అలరించనున్న ఫరియా అబ్దుల్లా
- ఈ నెల 4వ తేదీన సినిమా విడుదల
- ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్
హీరోగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ సంతోష్ శోభన్ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' రెడీ అవుతోంది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంతోష్ శోభన్ - ఫరియా ఇద్దరూ కూడా 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్నారు.
సంతోష్ మాట్లాడుతూ .. "మా నాన్న ప్రభాస్ హీరోగా 'వర్షం' సినిమాను తెరకెక్కించారు. అలాగే మహేశ్ బాబుగారితో 'బాబీ' సినిమాను తీశారు. నాన్నగారు చనిపోయేనాటికి నాకు 12 ఏళ్లు ఉంటాయి. ఒక సినిమా కోసం ఆయన కథను చెప్పడానికి భూమిక గారిని కలిశారు. ఆమెకి కథ చెప్పి వచ్చిన తరువాత ఆయనకి ఫస్టు స్ట్రోక్ వచ్చింది. అలా ఆయన మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు.
హీరోగా ఈ రోజున ఈ స్థాయికి నేను రావడమనేది ఆయాన చూస్తున్నారా? లేదా? అనే విషయం నాకు తెలియదు గానీ, ఆయన ఉంటే చాలా బాగుండేది. ఆయన ఆశీస్సుల వలన మంచి పొజీషన్ కి వెళతాననే నమ్మకం ఉంది. అందుకు అవసరమైన కృషి నేను చేస్తూనే ఉంటాను. ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ ఇస్తుందని నమ్ముతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.