ఇన్ స్టా గ్రామ్ లోనూ సాంకేతిక సమస్య.. ఇబ్బంది పడ్డ యూజర్లు
- సోమవారం సాయంత్రం నుంచి సమస్యలు
- అకౌంట్ సస్పెండ్ అయినట్టు సందేశం
- ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇదే అనుభవం
- బగ్ ను గుర్తించి సరిచేసిన సంస్థ
వాట్సాప్ నిలిచిపోయిన వారంలోపే ఇన్ స్టాగ్రామ్ కూడా మొరాయించింది. సోమవారం సాయంత్రం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లు ఇన్ స్టాగ్రామ్ లో లాగిన్ అవ్వలేకపోయారు. ‘మీ ఖాతా సస్పెండ్ అయిందంటూ’ వారికి సందేశం కనిపించింది. యూజర్లు దీన్ని ఇన్ స్టా గ్రామ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇన్ స్టా గ్రామ్ స్పందిస్తూ.. ‘‘మీలో కొందరు ఇన్ స్టా గ్రామ్ ఖాతాను యాక్సెస్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. మేము దీన్ని సరిచేసే పనిలో ఉన్నాం. జరిగిన అసౌకర్యానికి మన్నించండి’’ అని ఇన్ స్టా గ్రామ్ ట్విట్టర్ లో ప్రకటించింది.
ఆలస్యం అయినా ఈ సమస్య ఎక్కడ ఉందో గుర్తించి ఇన్ స్టాగ్రామ్ గుర్తించి సరిచేసింది. ‘‘ఈ బగ్ ను పరిష్కరించాం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తమ ఖాతాల విషయంలో సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఇదే. ఖాతాదారుల ఫాలోవర్లలోనూ ఇది మార్పులు చేసింది. మన్నించండి’’ అని ఇన్ స్టాగ్రామ్ పేర్కొంది. వాట్సాప్ గత నెల 25న ప్రపంచ వ్యాప్తంగా కొన్ని గంటల పాటు నిలిచిపోవడం తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ తోపాటు, ఫేస్ బుక్ మెటాకు సంబంధించినవి కావడం గమనార్హం.