తాడోబా అభయారణ్యంలో మరో మూడు పిల్లలకు జన్మనిచ్చిన ‘జూనాబాయి’
- సంతతిని పెంచుకుంటూ పోతున్న పులి జూనాబాయి
- ఇప్పటి వరకు 17 పిల్లలకు జన్మనిచ్చిన వైనం
- ‘జూనాబాయి’పై సచిన్‌కు చెప్పలేనంత మమకారం
మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యాన్ని సందర్శించే పర్యాటకులను అలరించే పులి ‘జూనాబాయి’ ఆదివారం మరో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పటి వరకు అది మొత్తంగా 17 పిల్లలకు జన్మనిచ్చినట్టు అయింది. 9 సంవత్సరాల వయసున్న జూనాబాయి తొలి కాన్పులో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. రెండోసారి నాలుగు, మూడోసారి మూడు, నాలుగోసారి నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన జూనాబాయి.. తాజాగా ఐదో కాన్పులో మరో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో తాడోబా అభయారణ్యంలో దాని సంతతి పెరుగుతోంది.
పులులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన తాడోబా అభయారణ్యంలో జూనాబాయి కాకుండా మత్కనూరు, మోగ్లీ తదితర పేర్లున్న పులులు కూడా ఉన్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తరచూ ఈ అభయారణ్యాన్ని సందర్శిస్తూ ఉంటాడు. ఇక్కడికొచ్చినప్పుడు సచిన్ జూనాబాయిని చూడకుండా వెళ్లడు. అదంటే సచిన్‌కు అంత ఇష్టం మరి. గతేడాది ఈ అభయారణ్యాన్ని సందర్శించిన సచిన్‌కు రెండురోజులపాటు జూనాబాయి కనిపించలేదు. దీంతో మరో రోజు ఉండి దానిని చూశాకే అక్కడి నుంచి వెళ్లినట్టు అటవీ అధికారులు అప్పట్లో తెలిపారు.