కోహ్లీ రూం వీడియో లీక్... క్షమాపణలు చెప్పిన పెర్త్ హోటల్
- దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం పెర్త్ వచ్చిన టీమిండియా
- హోటల్ క్రౌన్ టవర్స్ లో ఆటగాళ్లకు బస
- కోహ్లీ రూంలో లేనప్పుడు వీడియో తీసిన వైనం
- ఇది తగదంటూ మండిపడిన కోహ్లీ
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. నిన్న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ జరగ్గా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా పెర్త్ నగరంలోని క్రౌన్ టవర్స్ హోటల్ లో బస చేసింది. అయితే, కోహ్లీ రూంలో లేని సమయంలో, ఎవరో అతడి గదిలోకి వెళ్లి, అక్కడున్న వస్తువులను వీడియో తీయడం కలకలం రేపింది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కోహ్లీ ధరించే దుస్తులు, కళ్లద్దాలు, టోపీలు, బూట్లు, ఇతర వస్తువులన్నింటినీ ఓ ప్రదర్శనగా ఈ వీడియోలో చూపించారు. దీనిపై కోహ్లీ భగ్గుమనడం తెలిసిందే.
తన రూం వీడియో లీక్ కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతరుల ఏకాంతాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఓ వినోద వస్తువుగా చూడడం తగదని స్పష్టం చేశాడు. తమ అభిమాన క్రికెటర్లకు సంబంధించిన ఇలాంటి వీడియోలను ఫ్యాన్స్ ఇష్టపడతారన్న విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని, కానీ ఈ విధంగా హోటల్ రూంలోకి చొరబడి వీడియో తీయడం చూస్తుంటే మతిపోయింది అని వ్యాఖ్యానించాడు.
దీనిపై క్రౌన్ టవర్స్ హోటల్ మేనేజ్ మెంట్ స్పందించింది. కోహ్లీకి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనకు పాల్పడినవారిని గుర్తించామని తెలిపింది. వారిని విధుల నుంచి తొలగించామని, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరుపుతున్నట్టు పేర్కొంది. అంతేకాదు, కోహ్లీ రూం ఫుటేజి ఒరిజినల్ వీడియోను కూడా సామాజిక మాధ్యమాల నుంచి తొలగించామని క్రౌన్ టవర్స్ వర్గాలు తెలిపాయి.