ఇంట్లో దాచుకున్న బంగారంపై టాక్స్ పడుతుందా..?
- పొదుపు చేసిన సొమ్ముతో కొన్న బంగారానికి పన్ను లేదు
- వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలపైనా పన్ను ఉండదు
- వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాముల నగలు కలిగివుండచ్చు
- మూడేళ్ల తర్వాత బంగారాన్ని అమ్మితే కేపిటల్ గెయిన్స్ కింద పన్ను వర్తింపు
మహిళలకు అలంకారంగా, మగవాళ్లకు రిస్క్ లేని పెట్టుబడి ఏదంటే టక్కున గుర్తొచ్చేది బంగారమే! పండగనో, పుట్టిన రోజు కానుక అనో మరొకటనో.. ఎంతోకొంత బంగారం కొనడం, ఇంట్లో వాళ్లకు చిన్నదో పెద్దదో నగ చేయించడం మధ్యతరగతి కుటుంబాల్లో సాధారణమే! అయితే, ఇలా ఇంట్లో దాచుకున్న బంగారం కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుందనే విషయం తెలుసా..? ఇంట్లో పరిమితికి మించిన బంగారం ఉంటే దానిపైన తప్పకుండా పన్ను చెల్లించాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలు ఇలా ఉన్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ప్రకారం..
బంగారం కొనడానికి వెచ్చిస్తున్న మొత్తం ఎలా సంపాదించారనే దానిపై పన్ను ఎంత పడుతుందనేది ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం, ఇంట్లో పొదుపు చేసిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేసినా, వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలపైనా ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. చట్ట ప్రకారం ఓ వివాహిత తన ఇంట్లో 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాముల వరకు బంగారం(నగలు)ను కలిగి ఉండవచ్చు. ఈ పరిధిలోపల ఉంటే ఎలాంటి ట్యాక్సులూ చెల్లించాల్సిన అవసరంలేదు. అలాగే, సోదాల్లో ఈ పరిమితిలోపే బంగారం దొరికితే అధికారులు దానిని సీజ్ చేయడానికి వీల్లేదు. వెల్లడించిన ఆదాయం(ఫలానా మార్గంలో సంపాదించిన మొత్తం)తో కొనుగోలు చేసిన బంగారం నిల్వ ఉంచుకోవడానికి ఎలాంటి పరిమితి లేదు.
దాచుకున్న బంగారాన్ని అమ్మే సందర్భాల్లో..
మూడేళ్లకంటే ఎక్కువ కాలం మీ దగ్గరున్న బంగారాన్ని అమ్మితే అది దీర్ఘకాలిక పెట్టుబడి ఆదాయం(ఎల్ టీసీజీ) కిందికి వస్తుంది. ఆదాయపన్ను నియమాల ప్రకారం.. వచ్చిన సొమ్ముపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఒకవేళ మూడేళ్లలోపే అమ్మేస్తే అది వ్యక్తిగత ఆదాయం కిందికి వస్తుంది. దీనిపైనా నిర్ణీత మొత్తంలో పన్ను చెల్లించాలి. సావరీన్ గోల్డ్ బాండ్(ఎస్ జీబీ) ల అమ్మకానికీ ఇదే నియమం వర్తిస్తుంది. ఈ బాండ్ల మెచ్యూరిటీ పీరియడ్ పూర్తయ్యాక వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు.